వరుణ్ తేజ్ సూపర్ ప్లానింగ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈమధ్యనే గద్దలకొండ గణేష్ సినిమాతో హిట్టు కొట్టాడు. ముకుంద నుండి ఎఫ్-2 వరకు సాఫ్ట్ క్యారక్టర్స్ లో అలరించిన వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమాలో మాస్ పాత్రలో దుమ్ముదులిపేశాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తన కథల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే నూతన దర్శకుడు కిరణ్ డైరక్షన్ లో సినిమా మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ స్పోర్ట్స్ పర్సన్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. 

ఈ మూవీతో పాటుగా తనకు తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు వరుణ్ తేజ్. తొలిప్రేమ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా చేసిన వెంకీ అట్లూరి ఆ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం నితిన్ తో రంగ్ దే సినిమా చేస్తున్న వెంకీ మరోసారి వరుణ్ తేజ్ కోసం క్రేజీ లవ్ స్టోరీ ఒకటి సిద్ధం చేశాడట. ఆల్రెడీ హిట్ కాంబినేషన్ కాబట్టి రాబోయే ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.