సైరాలో చరణ్ కూడా ఉండాల్సింది.. కాని..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించాడు. పరుచూరి బ్రదర్స్ పదేళ్ల క్రితమే ఈ సినిమా కథ రాసుకున్నారు. అయితే చిరంజీవితో సైరా అనుకున్నప్పుడు డైరక్టర్ సురేందర్ రెడ్డి రాం చరణ్ కు ఒక పాత్ర అనుకున్నాడట.

ఇప్పటికే లెంగ్త్ ఎక్కువవుతుందన్న ఉద్దేశంతో ఆ పాత్రని కథ చర్చల సమయంలోనే ఆపేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ రాం చరణ్ కూడా ఈ సినిమాలో ఉండి ఉంటే ఆ లెక్క వేరేలా ఉండేదని చెప్పొచ్చు. సైరా సినిమాలో చిరంజీవి మరోసారి తన నట విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు. సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్స్ తోనే సైరా సంచలనాలు షురూ చేసినట్టు తెలుస్తుంది.