పూజా హెగ్దె ఈజ్ ఆన్ ఫాం..!

కెరియర్ మొదట్లో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమెది ఐరన్ లెగ్ అనేశారు. కాని ఇప్పుడు ఆ హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఒక్క హిట్టు అమ్మడి ఫేట్ మార్చేసింది. అందం అభినయం రెండు కలగలిపి ఉన్న పూజా హెగ్దె ఇప్పుడు తెలుగులో సూపర్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. రీసెంట్ గా వచ్చిన గద్దలకొండ గణేష్ లో చేసింది చిన్న పాత్ర అయినా కూడా పూజా హెగ్దె అదరగొట్టింది. అంతేనా దేవత రీమేక్ సాంగ్.. ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ లో అచ్చం శ్రీదేవి మళ్లీ దిగొచ్చిందా అన్నంతలా పూజా సర్ ప్రైజ్ చేసింది.    

ఇక తన క్రేజ్ మరింత పెంచుకునేలా సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా రెచ్చిపోతుంది పూజా. లేటెస్ట్ గా అమ్మడు హాట్ లుక్స్ మరోసారి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో బన్నితో జోడీ కడుతున్న పూజా హెగ్దె ప్రభాస్ తో జాన్ సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా క్రేజీ మూవీస్ కావడంతో అమ్మడికిక తిరుగులేదని చెప్పొచ్చు.