చరణ్ ఆ సినిమా రీమేక్.. ఎవరికోసం..?

సైరా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాం చరణ్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ గా చేసిన సైరా సినిమా బుధవారం రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి స్టార్స్ నటించారు.  

ఇక ఈ సినిమాతో పాటుగా చిరంజీవి, కొరటాల శివ కాంబో మూవీని కూడా రాం చరణ్ నిర్మిస్తున్నాడు. అంతేకాదు రాం చరణ్ ఓ మళయాళ సినిమా రీమేక్ రైట్స్ కొన్నాడని లేటెస్ట్ న్యూస్. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన లూసిఫర్ సినిమా తెలుగు రైట్స్ రాం చరణ్ దక్కించుకున్నాడట. ఈ సినిమాను కూడా చిరంజీవితో తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మళయాళ స్టార్ పృధ్వి రాజ్ ఈ సినిమా డైరెక్ట్ చేశారు. అయితే సినిమాలో పృధ్వి రాజ్ కూడా నటించారు. చిరు, చరణ్ ఇద్దరు కలిసి ఈ సినిమా చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. మరోపక్క ఈ సినిమాను చరణ్ పవన్ కళ్యాణ్ తో చేస్తాడని అంటున్నారు. మరి అఫిషియల్ గా ఎనౌన్స్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే.