సామజవరగమన.. సూపర్ రికార్డ్..!

అల్లు అర్జున్ తన సినిమాల్లో సాంగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్న బన్ని సినిమా నుండి మొదటి సాంగ్ సామజవరగమన రిలీజ్ చేశారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలోని ఈ సాంగ్ రిలీజ్ అవడం వైరల్ అవడం కూడా జరిగింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సాంగ్ కోటి వ్యూస్ సాధించింది అంటే సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.. తమన్ సంగీతం.. సిద్ శ్రీరాం గానం.. సామజవరగమన సాంగ్ కు క్రేజ్ తీసుకొచ్చాయి. వ్యూస్ మాత్రమే కాదు ఈ సాంగ్ కు 2,50,000 లైకులు కూడా వచ్చాయి. కేవలం సాంగ్ కే అల వైకుంఠపురములోకి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. 2020 సంక్రాంతికి ఈ సినిమా వస్తుంది. పూజ హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్, సుశాంత్, నివేదా పేతురాజ్ కూడా నటిస్తున్నారు.