యువ హీరోతో శ్రీను వైట్ల

కమర్షియల్ సినిమాలకు కామెడీని మిక్స్ చేసి సినిమాలు చేయడం అంటే అది డైరక్టర్ శ్రీను వైట్లకు వెన్నతో పెట్టిన విద్య. హీరో ఎవరైనా.. కథ ఏదైనా తన సినిమా అంటే ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ వాల్యూస్ తో పాటుగా కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని శ్రీను వైట్ల లాస్ట్ ఇయర్ రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేశాడు. అది కూడా అపజయపాలవడం వల్ల అతనికి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు.

లేటెస్ట్ గా యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ శ్రీను వైట్ల డైరక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడట. బెల్లంకొండ సురేష్ తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ సినిమాలైతే చేస్తున్నాడు కాని ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేదు. రీసెంట్ గా వచ్చిన రాక్షసుడు సినిమా కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు. శ్రీను వైట్ల, బెల్లంకొండ శ్రీనివాస్ మధ్య కథా చర్చలు జరిగాయట. త్వరలోనే ఈ కాంబినేషన్ మూవీ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది.