
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. చిరుతో పాటుగా సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ నటించారు. మెగాస్టార్ సినిమా అంటే ఆ సినిమా గురించి మెగా హీరోలంతా మాట్లాడుతారు. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా మెగా హీరోలంతా వచ్చారు.
కాని అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకు సైరా గురించి నోరు విప్పలేదు. సైరా ఈవెంట్ కు రాలేదు సరికదా ఇప్పటివరకు సైరాపై తన స్పందన తెలియచేయకపోవడంతో మెగా ఫ్యాన్స్ మళ్లీ బన్నిని టార్గెట్ చేశారు. ఇలా టార్గెట్ అయ్యాక తన స్పందన తెలియచేయడంలో ఏం కిక్ ఉందో కాని మెగా ఫ్యాన్స్ తాకిడి భరించలేకనే ఏమో ఫైనల్ గా అల్లు అర్జున్ కూడా సైరాపై తన రెస్పాన్స్ తెలియచేశాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ చిత్రం సైరా నరసింహా రెడ్డి. తెలుగు సినిమా గర్వించేలా చేస్తుంది. మగధీర చూసిన సమయంలో చిరంజీవి గారిని అలా ఓ సినిమాలో చూడాలని అనుకున్నా అది సైరాతో నెరవేరిందని.. సినిమా తీసిన నిర్మాత చరణ్ కు.. దర్శకుడు సురేందర్ రెడ్డికి బెస్ట్ విషెస్ అందించాడు బన్ని. మరి సినిమా రిలీజ్ రెండు రోజులు ఉందగానే సైరాపై తను మాట్లాడాలని అనుకున్నాడా.. లేక మెగా ఫ్యాన్స్ గోల బరించలేకనే అల్లు అర్జున్ సైరా గురించి కామెంట్ చేశాడా అన్న డౌట్ కూడా ఉంది. ఏది ఏమైనా సైరాపై బన్ని తన ఫీలింగ్స్ ను షేర్ చేసుకున్నాడు.