నిర్మాత రాం చరణ్.. సూపరంటే సూపర్..!

స్టార్ హీరోగా సూపర్ ఫాంలో ఉన్న రాం చరణ్ తండ్రి కోసం నిర్మాతగా మారాడు. పదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి చేసిన ఖైది నంబర్ 150తో నిర్మాతగా మారాడు రాం చరణ్. ఆ సినిమా సక్సెస్ అవడంతో తండ్రి డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి సినిమాకు నిర్మాతగా మారాడు. తండ్రి కల నెరవేర్చేందుకు బడ్జెట్ లో కూడా ఎక్కడ రాజీ పడలేదు రాం చరణ్. ఇక యువ నిర్మాతగా రాం చరణ్ మనసులు గెలుస్తున్నాడు.     

సైరా ప్రమోషన్స్ అన్నిటిలో నిర్మాతగా తన బాధ్యతను ఊహించిన దాని కన్నా ఎక్కువగా నటీనటులను, టెక్నిషియన్స్ ను చాలా గొప్పగా ప్రశంసిస్తున్నాడు రాం చరణ్. చెన్నై ప్రమోషన్స్ లో అక్కడ హీరో విజయ్ సేతుపతి గురించి చరణ్ మాట్లాడిన మాటలు అందరిని సర్ ప్రైజ్ చేశాయి. తానో టాలీవుడ్ స్టార్ హీరో అన్న విషయాన్ని కూడా పక్కనపెట్టి విజయ్ సేతుపతికి తాను అభిమానిని అంటూ చరణ్ చెప్పడం గొప్ప విషయం.        

కన్నడ, మళయాళ భాషల్లో కూడా సైరా నిర్మాతగా రాం చరణ్ అందరిని పలుకరిస్తూ హీరోగానే కాదు నిర్మాతగా కూడా సూపర్ అనిపించుకుంటున్నాడు. అంతేకాదు బడ్జెట్ భారీగా పెట్టేశాం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అలానే చేయాలన్న ఆలోచనతో కాకుండా బిజినెస్ రేంజ్ ను బట్టి సినిమా రైట్స్ అమ్మారట. మొత్తానికి చరణ్ నిర్మాతగా మేనమామ అల్లు అరవింద్ తెలివి తేటలను సంపాదించాడని చెప్పొచ్చు.