మహేష్ ఐటం.. మిల్కీ బ్యూటీ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం అనీల్ రావిపుడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపిస్తుందని తెలుస్తుంది. ఈమధ్య హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. సినిమాకు వారి స్పెషల్ అప్పియరెన్స్ కూడా హెల్ప్ అవుతుంది.    

ప్రస్తుతం సైరా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న తమన్నా మహేష్ ఐటం సాంగ్ గురించి చెప్పుకొచ్చింది. ఆ సాంగ్ మహేష్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరచడం ఖాయమని చెబుతుంది. సరిలేరు నీకెవ్వరులో ఆ సాంగ్ అదిరిపోతుందని చెబుతుంది తమన్నా. ఇన్నాళ్లు మహేష్ తో స్పెషల్ సాంగ్ చేసేది ఎవరా అన్న కన్ ఫ్యూజన్ ఉంది. కాని తమన్నా క్లారిటీ ఇవ్వడంతో మహేష్ తో స్పెషల్ సాంగ్ చేసేది ఆమె అని కన్ఫాం అయ్యింది. ఇంతకుముందు మహేష్ తో ఆగడు సినిమాలో హీరోయిన్ గా నటించింది తమన్నా. ఆ సినిమా అంచనాలను అందుకోలేదు.