నా కెరియర్ ఇక్కడే మొదలైంది..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయాళ భాషల్లో అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో చిరంజీవి, రాం చరణ్, తమన్నా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమిళంలో సైరా సినిమాను ఆర్.బి చౌదరి రిలీజ్ చేస్తున్నారు.    

ఇక సైరా తమిళ రిలీజ్ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. తన సినిమా కెరియర్ మద్రాసులోనే ప్రారంభమైందని అన్నారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి చెందిన సినిమా కాదు యూనివర్సల్ సినిమా.. మొదటి స్వాతంత్ర సమరయోధుడి కథ. అందుకే ఈ సినిమా చేశానని అన్నారు. చిరంజీవి. పదేళ్ల క్రితమే ఈ సినిమా చేయాలని అనుకున్నాం కాని అప్పట్లో బడ్జెట్ సమస్యల వల్ల కుదరలేదు. 

బాహుబలి తర్వాత మాకు ఆ ధైర్యం వచ్చింది. అందుకే ఎవరో నిర్మించాలని కాకుండా సొంత బ్యానర్ లో తామే ఈ సినిమా నిర్మించామని అన్నారు చిరంజీవి. సినిమాకు పనిచేసిన అందరు చాలా కష్టపడ్డారని.. సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ అందరిని మెప్పిస్తుందని అన్నారు.