
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న వారిలో నయనతార కూడా ఒకరు. ముఖ్యంగా కోలీవుడ్ ఆమె సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారింది నయనతార. తమిళంలో ఆమె సినిమాలతో స్టార్స్ కు చుక్కలు చూపిస్తుంది. ఇక కొన్నాళ్లుగా విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్న నయనతార ఇన్నాళ్లకు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.
విఘ్నేష్, నయన పెళ్లి అయ్యిందంటూ కొన్ని వార్తలు రాగా వాటికి వాళ్లిద్దరు సమాధానం ఇవ్వలేదు. రీసెంట్ గా డైరక్టర్ విఘ్ణేష్ శివ బర్త్ డే నయనతార గ్రాండ్ గా నిర్వహించింది. ఇరు కుటుంబ సభ్యుల నుండి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రావడంతో పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తుంది. డిసెంబర్ 25న విఘ్నేష్ శివన్, నయనతార పెళ్లంటూ వార్తలు వస్తున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాగా ఫారిన్ లో వీరిద్దరి వెడ్డింగ్ జరుగనుందట. మరి ముహుర్తం ఎప్పుడు.. ఈ వెన్యూ ఎక్కడ అన్నది మాత్రం ఇంకా తెలియలేదు.