
కమెడియన్స్ కు కూడా హీరో కావాలన్న కల ఉంటుంది. అయితే ఒకటి రెండు సార్లు అలా హీరో కావాలన్న ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈసారి ఆ కమెడియన్ తానే దర్శక నిర్మతగా మారి చేసిన ప్రయత్నం భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. మంచి రసగుల్లా లాంటి సినిమా అంటూ క్యాప్షన్ పెట్టారు. కేవలం డైరక్షన్ మాత్రమే శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నాడు ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని పరం చేశాడు.
కథ మీద అంత నమ్మకం ఉండబట్టే శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమా నిర్మించారని తెలుస్తుంది. ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డితో పాటుగా సత్య, వెన్నెల కిశోర్, షకల శంకర్ నటిస్తున్నారు. ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పించేలా కనిపిస్తుంది.