
బిగ్ బాస్ సీజన్ 3 నుడి లీక్స్ ఆపడం ఎవరి వల్లా కావట్లేదు. మొదటి సీజన్ వరకే బిగ్ బాస్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఎక్సైట్మెంట్ ఉంది. సెకండ్ సీజన్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3 కూడా అక్కడే అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ సెట్ లో జరుగుతుంది. మన దగ్గరే అయ్యే సరికి ఈ లీకులు ఎలాగోలా బయటకు వస్తున్నాయి. ఈ వారం కూడా ఎల్లిమినేట్ అయ్యేది ఎవరన్నది లీక్ అయ్యింది.
ఈ వారం నామినేషన్స్ లో శ్రీముఖి, రవి కృష్ణ, బాబా భాస్కర్, వరుణ్ సందేష్ లు ఉన్నారు. వీరిలో బాబా భాస్కర్, రవి కృష్ణలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని ముందే ఊహించారు. అయితే అనుకున్నట్టుగానే రవికృష్ణ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాడట. హౌజ్ లో 10 వారాలుగా తన మంచితనంతో అందరిని ఆకట్టుకున్న రవి కృష్ణ ఈ వారం ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. తాను టైటిల్ గెలవకున్నా రవికృష్ణ అంటే మంచోడన్న విషయం మాత్రం అందరికి తెలిసింది.