
సెప్టెంబర్ 27, 2001 రాజమౌళి, ఎన్.టి.ఆర్ కలిసి చేసిన సినిమా స్టూడెంట్ నంబర్ 1 రిలీజైంది. అంటే సరిగ్గా 18 ఏళ్ల క్రితం అన్నమాట. అప్పటికే ఒక సినిమా అనుభవం ఉన్న తారక్ తో రాజమౌళి మొదట డైరెక్ట్ చేసిన సినిమా అది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఎన్.టి.ఆర్ తో సింహాద్రి, యమదొంగ సినిమాలు చేశాడు రాజమౌళి. ప్రస్తుతం అదే రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు తారక్.
18 ఏళ్ల క్రితం స్టూడెంట్ నంబర్ 1 రిలీజ్ అవగా.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కోసం స్టూడెంట్ నంబర్ 1 షూటింగ్ లొకేషన్స్ ను జత చేస్తూ రెండు ఫోటోలు పెట్టాడు రాజమౌళి. అప్పుడు ఇప్పుడు 18 ఏళ్ల క్రితం అంటూ ఫోటోలు పెట్టారు. ఆరెఫ్సిలోనే కాదు మాలో కూడా మార్పు వచ్చిందంటూ పిక్స్ షేర్ చేశాడు రాజమౌళి. ప్రస్తుతం తారక్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో రాం చరణ్ కూడా మరో హీరోగా చేస్తున్నాడు.