
సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. సంక్రాంతి సినిమాలకు ఇప్పటి నుండే బిజినెస్ మొదలు పెట్టారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో స్టార్ సినిమాల ముందే సెట్ రైట్ చేసుకుంటున్నారు.
మహేష్ కు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. అయితే ఈమధ్య తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో పెద్దగా వర్క్ అవుట్ కావట్లేదు. అందుకే ఇదవరకులా కాకుండా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ స్టార్ సినిమాలకు ఆచి తూచి అడుగులేస్తున్నారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా 13.5 కోట్లకు డీల్ క్లోజ్ చేశారట. అంటే సినిమా హిట్ అవ్వాలి అంటే 2.7 మిలియన్ మార్క్ దాటాల్సిందే. వరుస హిట్లతో సూపర్ ఫాంలో అనీల్ రావిపుడి సరిలేరు నీకెవ్వరు సినిమాతో కూడా మరో సెన్సేషనల్ హిట్ కొట్టేలా ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న మహేష్ ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.