పూరి గొప్ప మనసు..!

కృష్ణా నగరే మామా.. కృష్ణా నగరే మామా.. సినిమాలే లైఫుర మామా.. లైఫంతా సినిమా మామా అంటూ పూరి డైరక్షన్ లో వచ్చిన నేనింతే సినిమా పాట గుర్తుంది కదా.. పూరి సినిమాను ఎంతగా ప్రేమిస్తాడు అని చెప్పడానికి ఈ సినిమా.. ఈ పాట ఓ ఉదాహరణ. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా పరిశ్రమకు ఏ రకంగా అయినా సపోర్ట్ చేయాలనుకునే పూరి రీసెంట్ గా ఓ హిట్టు కొట్టాక ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు. పూరి జగన్నాథ్ బర్త్ డే సందర్భంగా దర్శకులకు ఆర్ధిక సాయం చేస్తున్నట్టు తెలుస్తుంది.     

రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న పూరి దర్శకుడిగా కాదు నిర్మాతగా కూడా మంచి లాభాలు తెచ్చుకున్నాడు. అయితే వచ్చిన ఇస్మార్ట్ లాభాలు ఒక్కడే జేబులో వేసుకోకుండా పరిశ్రమలో చితికిపోయిన దర్శకులు, అసిస్టెంట్ డైరక్టర్స్ కోసం సపోర్ట్ గా నిలుస్తున్నాడు. వారి కోసం కొంతమొత్తాన్ని సాయంగా అందించాడు పూరి జగన్నాథ్. మా చిన్న సాయం మీకు ఏమాత్రం ఊరటనిచ్చినా చాలంటూ డబ్బుతో పాటుగా ఓ లెటర్ ను రాశాడట పూరి. ఇలా ఒకప్పుడు పరిశ్రమ కోసం పనిచేసిన దర్శకులను గుర్తించి ఆర్ధిక సహాయం చేయడం చాలా గొప్ప విషయమని చెప్పొచ్చు. పూరి చేస్తున్న ఈ మంచి పనికి అందరు ప్రశంసిస్తున్నారు.