
సైరా రిలీజ్ అవడమే ఆలస్యం వెంటనే కొరటాల శివ సినిమా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు చిరంజీవి. ఈ మూవీని కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తాడట. డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీకి మ్యూజిక్ డైరక్టర్ గా బాలీవుడ్ నుండి అజయ్-అతుల్ లను సెలెక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన మిర్చి నుండి భరత్ అనే నేను వరకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
కాని ఈ సినిమాకు కొరటాల శివ ఎందుకో బయటకు వెళ్లాలన్ని చూస్తున్నాడట. అయితే ఏమైందో ఏమో కాని కొరటాల శివ మళ్లీ ఏమైందో ఏమో కాని చిరు సినిమాకు డిఎస్పినే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా చిరు సినిమా కూడా చేస్తున్నాడు. ఈమధ్య రొటీన్ గా మ్యూజిక్ అందిస్తున్నాడన్న దేవి శ్రీ ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్టులతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.