
గోపిచంద్ హీరోగా కోలీవుడ్ డైరక్టర్ తిరు డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా చాణక్య. అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాలో రా ఏజెంట్ గా.. బ్యాంక్ ఎంప్లాయ్ గా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో గోపిచంద్ కనిపిస్తున్నాడు. సినిమా కథ కొత్తగా అనిపించకున్నా తిరు మేకింగ్ బాగుందనిపిస్తుంది. కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లేని గోపిచంద్ చాణక్యతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఆశించిన స్థాయిలో ఉండేలా కనిపిస్తుంది. అయితే ఓ పక్క సైరా నరసిం హా రెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ అవుతుండగా ఆ సినిమా రిలీజ్ తర్వాత రెండు రోజుల గ్యాప్ తో గోపిచంద్ చాణక్య వస్తుంది. ఒకవేళ సైరా సూపర్ హిట్ అయితే మాత్రం గోపిచంద్ సినిమా మీద ఎఫెక్ట్ పడేలా ఉంది. మరి చిరుతో పోటీ పడుతున్న చాణక్య ఎలాంటి ఫలితన్ని అనుకుంటాడో చూడాలి.