
కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సుభాస్కరణ్ అజ్ఞాతంలోకి వెళ్లిన వార్తలు తమిళ సిని పరిశ్రమలో హాట్ న్యూస్ గా మారాయి. లైకా ప్రొడక్షన్స్ అధినేత భారీ సినిమాలు నిర్మించే సుభాస్కరణ్ 2.ఓ సినిమాకు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. అయితే ఆ సినిమా కోసం ఫైనాన్షియర్స్ నుండి 185 కోట్ల దాకా తీసుకున్నాడట. అయితే సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోవడం వల్ల నష్టాలపాలయ్యాడు.
ఫైనాన్షియర్స్ సుభాస్కరణ్ మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఫైనాన్షియర్స్ అంతా చెన్నై పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారట. ప్రస్తుతం సుభాస్కరణ్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో ఇండియన్ 2 సినిమా నిర్మిస్తున్నారు. కొన్నాళ్లు ఈ సినిమాకు బ్రేక్ ఇవ్వగా రీసెంట్ గా రాజమండ్రి సెంట్రల్ జైలులో షూటింగ్ మొదలుపెట్టారు. మరి ఓ పక్క ఈ మూవీ నిర్మాణంలో ఉండగా సుభాస్కరణ్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఇండియన్ 2 సినిమా ఆగిపోతుందన్న వార్తలు వస్తున్నాయి.