బంగార్రాజుకి నో చెప్పాడా..!

కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో కింగ్ నాగార్జున నటించిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వల్ గా ఓ సినిమా ప్లాన్ చేశాడు నాగార్జున. రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని చెబుతున్నారు. బంగార్రాజు టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తారని తెలుస్తుంది.                  

అయితే ఈమధ్య కెరియర్ లో ఆచితూచి అడుగులేస్తున్న నాగ చైతన్య బంగార్రాజు సినిమా మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదట. నాగార్జున చేద్దామని చెప్పినా చైతు మాత్రం వద్దని అంటున్నాడట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో చైతు ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే అజయ్ భూపతి సినిమా లైన్ లో ఉంది. ఇలా వరుసగా సినిమాలు ఉండటంతో బంగార్రాజుకి నో చెప్పాడట. చైతు నిర్ణయం పట్ల నాగార్జున హ్యాపీగా లేడని తెలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ లేటవుతుందని అంటున్నారు. మరి బంగార్రాజులో చైతు ఉంటాడా లేడా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.