
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. 2020 సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా బిజినెస్ డీల్ మొదలయ్యాయని తెలుస్తుంది. ఓవర్సీస్ లో ఈ సినిమాను 9 కోట్లకు బ్లూ స్కై సినిమాస్ వారు తీసుకున్నారట. నిర్మాతలు 12 కోట్ల దాకా డిమాండ్ చేసినా ఈమధ్య తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంతో ఆ ఎఫెక్ట్ బిజినెస్ మీద పడ్డది.
అల్లు అర్జున్, త్రివిక్రం ఇద్దరు కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేశారు. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈమధ్యనే రిలీజైన అల వైకుంఠపురములో ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. సంక్రాంతికి బన్ని సినిమాతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా రిలీజ్ ప్లాన్ చేశారు.