రంగమ్మత్తకు లక్కీ ఛాన్స్..!

యాంకర్ గా ఓ పక్క స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ మంచి ఫాం కొనసాగిస్తున్న అనసూయ అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతుంది. కొన్ని ప్రత్యేకమైన పాత్రలను మాత్రమే చేస్తూ వస్తున్న అనసూయ లాస్ట్ ఇయర్ రాం చరణ్ రంగస్థలంలో చేసిన రంగమ్మత్త పాత్ర సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. క్షణంతో అనసూయ వెండితెర మీద నటించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటుంది. అయితే వచ్చిన ప్రతి సినిమా చేయకుండా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది అనసూయ.

ఇక ఇప్పుడు రంగమ్మత్త అదేనండి అనసూయకు మరో లక్కీ ఛాన్స్ వచ్చిందట. సుకుమార్ డైరక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కే సినిమాలో అనసూయ స్పెషల్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. రంగస్థలం సినిమా కూడా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమానే.. అందుకే అనసూయ కూడా బన్ని సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. ప్రస్తుతం బన్ని అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ అవడంతోనే సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ మూవీలో రశ్మిక మందన్న హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.