సైరా నుండి సెకండ్ ట్రైలర్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ షురూ చేశారు. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచగా ఆ అంచనాలు మరింత పెంచేందుకు చిత్రయూనిట్ మరో మెగా ప్లాన్ చేసింది.    

అదేంటి అంటే సైరా సినిమా నుండి మరో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారట. గురువారం ఉదయం పదిన్నరకు సైరా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. ఈ ట్రైలర్ మొత్తం బాటిల్ ఫీల్డ్ తో నిండి ఉంటుందని తెలుస్తుంది. సినిమా భారీతనాన్ని తెలియచేసేలా యుద్ధ సన్నివేశాలతో సైరా సెకండ్ ట్రైలర్ రాబోతుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు.