వేణు మాధవ్ ఆ కోరిక తీరకుండానే..!

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ వేణు మాధవ్ మృతి సిని పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇప్పటికే సిని ప్రముఖులందరు వేణు మాధవ్ కుటుంబానికి తమ సానుభూతి తెలుపుతున్నారు. 1996లో సంప్రదాయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వేణు మాధవ్ దాదాపు 600 సినిమాల్లో నటించడం విశేషం. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు.   

కమెడియన్ గా సూపర్ సక్సెస్ అయిన వేణు మాధవ్ ఒక కోరిక తీరకుండానే కాలం చేశారు. రాజకీయాల మీద మక్కువ చూపించే వేణు మాధవ్ 2014లో టిడిపి తరపున టికెట్టు ఆశించగా రాకపోవడంతో నిరాశ చెందారు. ఎలాగైనా సరే కోదాడకు ఎమ్మెల్యే కావాలనేది వేణు మాధవ్ కోరిక అని తెలుస్తుంది. అయితే ఆయన కోరిక తీరకుండానే కన్నుమూశారు. తెలుగు పరిశ్రమలో 23 ఏళ్ల కెరియర్ సాగించిన వేణు మాధవ్ కమెడియన్ గానే కాదు హీరోగా.. నిర్మాతగా ప్రయత్నాలు చేశారు.