గోపిచంద్ 'సీటీమార్'

కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లేక వెనుకపడ్డ గోపిచంద్ ప్రస్తుతం తిరు డైరక్షన్ లో చాణక్యగా రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత సంపత్ నంది డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన ముహుర్త కార్యక్రమాలు ఈమధ్యనే జరిగాయి. ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్, గౌతం నంద సినిమాలతో మాస్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న సంపత్ నంది గోపిచంద్ తో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది.

ఈ సినిమాకు టైటిల్ గా సీటీమార్ అని పెట్టబోతున్నారని తెలుస్తుంది. హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో సీటీమార్ సినిమా టైటిల్ ఉంటుంది. అంతేకాదు అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో కూడా సీటీమార్ సీటీమార్ అనే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక మెగా హీరోల మీద అమితమైన ప్రేమ చూపించే సంపత్ నంది గోపిచంద్ సినిమాకు అదే మెగా టైటిల్ వాడేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుందట. సంపత్ నంది డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాల్లో రెండు సినిమాల్లో తమన్నా హీరోయిన్ గా నటించింది. మరి గోపిచంద్ సీటీమార్ హీరో డైరక్టర్ ఇద్దరిని ఫాంలోకి తెస్తుందో లేదో చూడాలి.