అలి రెజా మళ్లీ వస్తాడా..!

బిగ్ బాస్ సీజన్ 3లో అలి రెజా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. స్టార్ మా అత్యంత పరిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉన్న అలి రెజా ఎలిమినేట్ అందరికి షాక్ అయ్యేలా చేసింది. అలి ఎలిమినేట్ అయ్యి రెండు వారాలు అవుతుంది. స్ట్రాంగ్ అనుకున్న అలి హౌజ్ నుండి బయటకు రావడంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది.

అందుకే మళ్లీ అలి రెజాని హౌజ్ లోకి పంపించాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం హౌజ్ లో వరుణ్, శ్రీముఖి, శివ జ్యోతి స్ట్రాంగ్ కంటెస్టంట్స్ గా కనిపిస్తున్నారు. బాబా భాస్కర్, మహేష్, వితిక, పునర్నవి హౌజ్ లో ఉన్నా వారు విజేతగా నిలిచే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే ఫేక్ ఎలిమినేషన్ తో రెండు రోజులు బయటకు వచ్చి మళ్లీ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ఇప్పుడు స్ట్రాంగ్ గా మారాడు. మంగళవారం టాస్క్ లో వరుణ్, రాహుల్ మధ్య ఫైట్ మొదలైంది. హౌజ్ లో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వరుణ్, రాహుల్ ల మధ్య గొడవ ఆడియెన్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది. మరి ఇలాంటి టైంలో అలి రెజా హౌజ్ లోకి వస్తాడా.. వచ్చి టైటిల్ గెలిచే అవకాశం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.