బ్రేకింగ్ : కమెడియన్ వేణు మాధవ్ ఇకలేరు

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా కాలేయ సంబందిత వ్యాధితో బాధపడుతున్న వేణు మాధవ్.. కిడ్నీ సమస్య కూడా ఉండటంతో రీసెంట్ గా సికిందరాబాద్ యశోదా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. అయితే డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా వేణు మాధవ్ ను కాపాడలేకపోయారు. మంగళవారం సాయంత్రం నుండి కండీషన్ సీరియస్ గా ఉండటంతో అప్పటి నుండే వేణు మాధవ్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి.   

ఇక కొద్ది గంటల క్రితమే వేణు మాధవ్ తుది శ్వాస విడిచారు. మిమిక్రీ ఆర్టిస్టుగా ప్రతిభ చాటి సినిమాల్లో అవకాశం సంపాదించిన వేణు మాధవ్ తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించారు. తెలుగులో స్టార్ హీరోల అందరితో కలిసి నటించిన వేణు మాధవ్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఈమధ్య సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో కనిపించిన వేణు మాధవ్ ఇక లేరన్న విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సిని ప్రముఖులు సైతం వేణు మాధవ్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నారు.