మెగా 'సూపర్' స్టార్లని మెప్పించాడు..!

వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా మిక్సెడ్ టాక్ తో మొదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా తెరకెక్కింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నట విశ్వరూపం చూపించిన ఈ సినిమా కలక్షన్స్ పరంగా కూడా అదరగొడుతుంది. ఇక ఈ సినిమా చూసి ఇప్పటికే సెలబ్రిటీస్ తమ అభిప్రాయాన్ని తెలుపగా లేటెస్ట్ గా సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్.. మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ సినిమాపై స్పందించారు.       

గద్దలకొండ గణేష్ సినిమా చూసిన మహేష్ సినిమాను బాగా ఎంజాయ్ చేశానని.. వరుణ్ తేజ్ అదరగొట్టాడని.. హరీష్ శంకర్ గ్రేట్ వర్క్ అంటూ చిత్రయూనిట్ అందరికి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ ట్వీట్ కు 14 రీల్స్ ప్లస్ అధినేతను రాం ఆచంట, గోపి ఆచంట థ్యాంక్స్ సూపర్ స్టార్ అని రిప్లై ఇచ్చారు. ఇక గద్దలకొండ గణేష్ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పాడట. హరీష్ శంకర్ డైలాగ్స్, డైరక్షన్ సూపర్ అన్నారట. నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారని.. టీం స్పిరిట్ కనిపిస్తుందని.. అద్భుతమైన విజయాన్ని అందుకున్న టీం అందరికి అభినందనలు తెలిపారట.