
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు. ఇండియన్ సినిమాకు సేవలందించిన వారికి ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం అందిస్తుంది. ఈ ఏడాది ఆ అవార్డ్ ను అమితాబ్ కు ఇస్తున్నట్టు ప్రకటించారు.
అక్టోబర్ 11, 1942 ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జన్మించిన అమితా హరివంశ్ ఇండియన్ సినిమాల్లో గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. జంజీర్, దీవార్ సినిమాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అమితాబ్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
నాలుగు దశాబ్ధాలుగా 190 సినిమాల్లో నటించిన అమితాబ్ ప్రస్తుతం చిరంజీవి లీడ్ రోల్ లో వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించారు. అమితాబ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ రావడంపై దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సిని సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.