
ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి ఏమి బాగాలేదని తెలుస్తుంది. కొన్నాళ్లుగా కాలేయ సంబందిత వ్యాధితో బాధపడుతున్న వేణు మాధవ్ రీసెంట్ గా కిడ్నీ సమస్య కూడా రావడంతో ఆయన్ను సికిందరాబాద్ యశోదా హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మిమిక్రీతో ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న వేణు మాధవ్ ఎస్వి కృష్ణా రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.
మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించిన వేణు మాధవ్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. తనదైన స్టైల్ లో కామెడీని పండించే వేణు మాధవ్ ఆరోగ్యం కుదుట పడాలని ఆయన ఫ్యాన్స్ తో పాటుగా సిని ప్రముఖులు కోరుకుంటున్నారు. ఈరోజు యశోద హాస్పిటల్ కు జీవిత రాజశేహర్ వెళ్లి వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుస్తున్నారట.