
ఎఫ్-2 సూపర్ హిట్ అవడంతో మళ్లీ సూపర్ ఫాంలోకి వచ్చిన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి వెంకీమామ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఆ ప్రాజెక్ట్ కు సంబందించిన అప్డేట్స్ బయటకు వచ్చాయి. వెంకీమామ తర్వాత వెంకటేష్ తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో మూవీ కన్ఫాం అయ్యిందట.
ఈ సినిమాలో వెకటేష్ హార్స్ రేసర్ గా కనిపిస్తాడట. సినిమా కథ కూడా ప్రయోగాత్మకంగా ఉంటుందని అంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. పెళ్లిచూపులుతో హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే తన మూడవ సినిమా వెంకటేష్ తో తీస్తున్నాడు తరుణ్ భాస్కర్. ఓ పక్క డైరెక్ట్ చేస్తూనే తను లీడ్ రోల్ గా మీకు మాత్రమే చెప్తా సినిమా చేస్తున్నాడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాను విజయ్ దేవరకొండ నిర్మిస్తున్నాడని తెలిసిందే.