మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన క్రేజీ మూవీ గద్దలకొండ గణేష్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచట నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె, అధర్వ, మృణాళిని వంటి స్టార్స్ నటించారు. లాస్ట్ ఫ్రై డే రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. సోమవారం సాయంత్రం ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ సినిమా రిలీజ్ కు కొద్ది గంటల ముందు టైటిల్ చేంజ్ అవడంపై స్పందించాడు.
సినిమా టైటిల్ వివాదంతో తనకు ఏం చేయాలో తోచని పరిస్థితి అయ్యిందని. ఆ టైంలో తను చరణ్ అన్నకు కాల్ చేశానని.. తన దగ్గరకు వెళ్లగా ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు కలిసి తన స్టెస్ ని తగ్గించారని అన్నాడు వరుణ్ తేజ్. ఇక సినిమా సక్సెస్ కు కారణమైన చిత్రయూనిట్ అందరికి థ్యాంక్స్ చెప్పాడు వరుణ్ తేజ్. సినిమాలో చిన్న కెమియో రోల్ అయినా సరే ఏమాత్రం ఈగో లేకుండా చేసినందుకు హీరో నితిన్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు వరుణ్ తేజ్. గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ నటనకు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాతో నటుడిగా వరుణ్ తేజ్ మరో మెట్టు ఎక్కాడని చెప్పడంలో సందేహం లేదు.