చరణ్ నిర్మాణంలో పవన్ మూవీ..!

హీరోగా సూపర్ ఫాంలో ఉన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇప్పుడు నిర్మాతగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ తొలి సినిమా ఖైది నంబర్ 150. మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా అది. ఈ సినిమాను రాం చరణ్ నిర్మించడం వల్ల మరింత క్రేజ్ ఏర్పడింది. చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డిని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

సైరా సినిమా ప్రమోషన్స్ షురూ చేయగా సైరాకు పవన్ కళ్యాణ్ ను బాగా వాడేస్తున్నాడు చరణ్. పవన్ కూడా చిరు మీద ఉన్న ప్రేమతో సినిమాలో వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాకుండా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నాడు. రీసెంట్ గా జరిగిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇక్కడ మరో విశేషం ఏంటంటే అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునేందుకు సిద్ధమవుతున్నాడట. నిర్మాతగా రెండు సినిమాలు చిరుతో నిర్మించిన చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. అదే జరిగితే ఇక ఆ సినిమా క్రేజ్ మాములుగా ఉండదని చెప్పొచ్చు. ఇప్పటికే పవన్ తో సినిమాకు దర్శక నిర్మాతలు క్యూ కడుతుండగా చరణ్ కు పవన్ ఆ ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.