సైరా నరసింహా రెడ్డి సెన్సార్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సైరా సినిమా 2 గంటల 45 నిమిషాల రన్ టైం వచ్చిందట. సైరా రన్ టైం 3 గంటల దాకా ఉంటుందని భావించారు కాని ఎడిటర్ చాలా కష్టపడి ఈ సినిమా రన్ టైం 2 గంటల 45 నిమిషాలకు ఫిక్స్ చేశారట. చారిత్రాత్మక చిత్రాలకు ఈ రన్ టైం చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు.     

సినిమా చూసిన సెన్సార్ టీం సైరాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారట. అంతేకాదు సినిమా దర్శక నిర్మాతలను మెచ్చుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ సభ్యుల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయాళ భాషల్లో గ్రాండ్ గా సైరా రిలీజ్ అవుతుంది. బిగ్ బి అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ సైరాలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ అంచనాలను పెంచగా సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.