
ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫాంలోకి వచ్చిన పూరి జగన్నాథ్ తన తర్వాత సినిమా విజయ్ దేవరకొండతో చేస్తున్నాడని తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీకి ఫైటర్ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీ తర్వాత పూరి మరోసారి నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ పూరి, బాలయ్య కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా వచ్చింది.
ఇద్దరు కలిసి మరో సినిమా చేయబోతున్నారట. అయితే ఈసారి పూరి బాలయ్యను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడట. పూరి సినిమాల్లో పోలీస్ పాత్రలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో తెలిసిందే. నాగార్జునతో శివమణి, మహేష్ తో పోకిరి సినిమాలు తీసి హిట్ కొట్టాడు పూరి. అందుకే బాలకృష్ణను పోలీస్ గా చూపించబోతున్నారట. సీనియర్ హీరో కింగ్ నాగార్జునకు శివమణి లాంటి హిట్ ఇచ్చిన పూరి బాలయ్యకు ఎలాంటి సినిమా ఇస్తాడో చూడాలి.