
స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో కోడి రామకృష్ణ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అరుంధతి. అప్పటివరకు కమర్షియల్ సినిమాలను మాత్రమే చేసే అనుష్క అరుంధతి సినిమాతో తనలోని మరో కొత్త యాంగిల్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. 2009 లో వచ్చిన ఆ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఈ సినిమాను అప్పట్లోనే బాలీవుడ్ లో రీమేక్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే అది ఇప్పటివరకు కుదరలేదు.
లేటెస్ట్ గా బాలీవుడ్ లో అరుంధతి రీమేక్ కు రంగం సిద్ధమైంది. బాలీవుడ్ లో సౌత్ సినిమాలు సూపర్ సక్సెస్ అవుతున్న సందర్భంగా బాలీవుడ్ జేజమ్మకు శ్రీకారం చుడుతున్నారు. ఈ రీమేక్ లో లీడ్ రోల్ కరీనా కపూర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పెళ్లి తర్వాత గ్యాప్ ఇచ్చిన కరీనా ప్రస్తుతం టివి షోస్ చేస్తుంది. కరీనాతో బాలీవుడ్ మేకర్స్ డిస్కస్ చేస్తున్నారట. ఒకవేళ కరీనా కాదంటే ఆ ఛాన్స్ అనుష్క శర్మకు వస్తుందని తెలుస్తుంది. అరుంధతి బాలీవుడ్ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో తెలియాల్సి ఉంది.