
సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటిలానే ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తాను ఇక్కడకు చిరంజీవి అభిమానిగా వచ్చానని.. ఈ వేడుకకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు పవన్. అందరు బాగుండాలని కోరుకునే వ్యక్తి అన్నయ్య చిరంజీవి. ఇప్పుడు తాను ఇలా మీ ముందు ఉన్నానంటే అది అన్నయ్య నేర్పిన పాఠాలే. ఇంటర్మీడియెట్ లో ఫెయిల్ అయిన తను.. అన్నయ్య తుపాకితో కాల్చుకోవాలని అనిపించింది. అలాంటి టైంలో అన్నయ్య నాకు చెప్పిన మాటలు ఎప్పటికి మర్చిపోలేనని అన్నారు పవన్.
అలా ఇంట్లో సర్ధి చెప్పే వాళ్లు ఉంటే ఇంటర్ విద్యార్ధులు చనిపోయే వారు కాదని అన్నారు. ప్రపంచ దేశాలు భారత దేశం మీద దాడి చేశాయి. కాని మన దేశం ఏ ఇతర దేశం మీద దాడి చేయలేదు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి లాంటి వ్యక్తుల సమూహమే భారతదేశం. పరుచూరి బ్రదర్స్ రెండు దశాబ్ధాలుగా ఈ కథను మోశారు. ఎంతమంది ఎన్ని రికార్డులు కొట్టినా చిరంజీవి గారి అనుభవాన్ని బద్ధలు కొట్టలేరని అన్నారు పవన్.
ఈ సినిమా కోసం నా గొంతు ఇచ్చాను. నా దేశం.. నా ప్రజల కోసం తీసిన సినిమా ఇది ఇంద్లో ఓ చిన్న భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా.. ఎవరెన్ని విజయాలు సాధించినా మేము అసూయ పడము.. ఎందుకంటే మేమంతా సినిమా జాతి అని ఎమోషనల్ గా మాట్లాడారు పవన్.