
ప్రస్తుతం సినిమాకు అయ్యే టికెట్ ఖర్చు కన్నా అందులో తినుబండారాల ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. మొన్నటిదాకా మల్టీప్లెక్స్ ల వరకే పరిమితమైన ఈ రేట్లు ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ కు వచ్చాయి. ఫ్యామిలీ మొత్తం సినిమాకు వెళ్తే వెయ్యి రూపాయలు కూడా సరిపోయే పరిస్థితి కనబడటం లేదు దానితోడు స్టార్ సినిమా అయితే టికెట్లు రేట్లు అధికమవడం కూడా జనాల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నాయి.
తెలంగాణా ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే మిడ్ నైట్ షోస్, థియేటర్స్ లో పార్కింగ్ ఫీస్ వసూళు చేయకుండా చూస్తున్న తెలంగాణా ప్రభుత్వం ఇక మీదట ఆన్ లైన్ బుకింగ్స్ మీద కొరడా ఝుళిపిస్తుంది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక మీద ఆన్ లైన్ టికెటింగ్ బంద్ చేయనున్నామని ప్రకటించడం విశేషం. అధికారికంగా టికెట్ల్ల అమ్మకాలు ప్రభుత్వ ఆధీనంలో జరుగుతాయని ప్రకటించారు. 18 నుండి 20 లైన్లు.. 8 టూ 10 లైన్స్ వరకు సీటింగ్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ప్రభువమే టికెట్ల అమ్మకాలు చేపడితే నిర్మాతలు పంపిణీదారుల నష్టాలు కూడా తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు. సో సినిమా రిలీజ్ అంటే బుక్ మై షో, పేటీయం అని ప్రాకులాడాల్సిన అవసరం లేదన్నమాట.