
ఆరెక్స్ 100 సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన కార్తికేయ ఆ సినిమా తర్వాత చేసిన హిప్పీ, గుణ 369 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హీరోగా చేస్తూనే విలన్ గా నాని గ్యాంగ్ లీడర్ లో నటించి మెప్పించాడు కార్తికేయ. ప్రస్తుతం అతను చేస్తున్న మూవీ 90 ఎం.ఎల్. శేఖర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ కొద్దిగంటల క్రితం రిలీజైంది.
నా కడుపున దేవదాస్ లాంటి కొడుకే పుట్టాలనుకున్న హీరో తల్లి.. అలానే యాజిటీజ్ గా లిక్కర్ లేనిదే ఉండలేని హీరో కథే 90 ఎం.ఎల్. ఇక టీజర్ లో.. డీజిల్ తో నడిచే బండ్లను చూసుకుంటావ్.. పెట్రోల్ తో నడిచే బండ్లను చూసుకుంటావ్.. ఇది లిక్కర్ తో నడిచే బండి గుద్దితే అడ్రెస్ ఉండదు.. ఇది హీరో గారి ఇంటెన్స్ డైలాగ్.. ఇక అలి వచ్చి డైలీ ఎంతేస్తావ్ అని క్లాస్ రూంలో అడిగితే పూటకో నైంటీ సార్ అంటాడు ఏ కోటరిస్తే తగవా అంటే డాక్టర్ నైంటీనే తాగమన్నాడు సార్ అంటూ చెబుతాడు.
టీజర్ చూసి ఇది ఎవరిని టార్గెట్ చేసుకుని తీశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలు, ఫ్యామిలీస్ ఈ సినిమాను చూసే అవకాశం కూడా ఇవ్వడం కష్టమని చెప్పొచ్చు. సినిమలో హీరోయిన్ గా నేహా సోలంకి నటిస్తుంది. టీజర్ లో ఆమెను రివీల్ చేయలేదు.