
ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్దె ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమా చేసింది. ఆ రెండు సినిమాలు ఫెయిల్ అవడంతో ఆ వెంటనే బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ హృతిక్ రోషన్ పక్కన ఛాన్స్ వచ్చినా వర్క్ అవుట్ కాకపోయేసరికి మళ్లీ తెలుగులో దువ్వాడ జగన్నాథం సినిమాలో నటించి మెప్పించింది. ఆ సినిమాలో అమ్మడి బికిని లుక్స్ ప్రేక్షకులను అలరించాయి. డిజే హిట్ అవడంతో పూజా హెగ్దె స్టార్ క్రేజ్ దక్కించుకుంది.
ఇక వరుసగా ఆమెకు స్టార్ ఛాన్సులు వచ్చాయి. మహేష్, ఎన్.టి.ఆర్ సినిమాల్లో నటించిన పూజా ప్రస్తుతం అల్లు అర్జున్ అలవైకుంఠపురములో., ప్రభాస్ జాన్ సినిమాల్లో ఫీమేల్ లీడ్ గా చేస్తుంది. ఇక శుక్రవారం రిలీజైన గద్దలకొండ గణేష్ సినిమాలో పూజా హెగ్దె శ్రీదేవి పాత్రలో నటించింది. సినిమాలో పూజా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేసిన దర్శకుడు పూజా లుక్స్, ఆమె పాత్రని తెరకెక్కించిన విధానం ఇంప్రెస్ చేసింది. పూజా హెగ్దెని చూసి ఆడియెన్స్ అంతా కేకలేశారంటే ఆమె రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. ఇక స్పెషల్ ఎట్రాక్షన్ గా ఎల్లువొచ్చి గొదారమ్మ సాంగ్ లో పూజా పర్ఫార్మెన్స్ అబ్బో అదరగొట్టేసిందని చెప్పొచ్చు.
కెరియర్ మొదట్లో ఐరన్ లెగ్ అన్న అపవాదాలు మోసిన పూజా ఇప్పుడు టాలీవుడ్ కు లక్కీ హీరోయిన్ అయ్యింది. గద్దలకొండ గణేష్ తో సూపర్ హిట్ అందుకున్న పూజా హెగ్దె మరో ఐదేళ్ల వరకు కెరియర్ కు ఢోకా లేదని చెప్పొచ్చు.