జీవితంలో ఎప్పటికి మర్చిపోను..!

కోలీవుడ్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వరుణ్ తేజ్ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా గద్దలకొండ గణేష్. వాల్మీకిగా సినిమాను ప్రమోట్ చేసి రిలీజ్ ముందురోజు రాత్రి టైటిల్ మార్చాల్సి వచ్చిది. గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో హరీష్ శంకర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈరోజు రిలీజైన గద్దలకొండ గణేష్ కు మంచి టాక్ రావడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో భాగంగా సినిమా దర్శకుడు హరీష్ శంకర్ నిన్న జరిగింది తాను జీవితంలో ఎప్పటికి మర్చిపోలేనని అన్నారు.

సినిమాను సినిమానే నిలబెడుతుందని అన్న హరీష్ మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిన్న కన్నా ఈరోజు బెటర్ గా ఉన్నాను.. అయితే కోలుకున్నానని మాత్రం చెప్పలేను.. నా మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక కూడా తర్వాత ఏంటని ఆలోచించా కాని నిన్న తర్వాత ఏంటని అనిపించింది. రాత్రంగా నిద్రపోలేదు.. నీ సినిమా ఏంటి అంటే చెప్పలేని పరిస్థితని అన్నారు. నిన్న ఆ ఇబ్బంది లేకపోతే ఈ విజయాన్ని మరోలా ఎజాయ్ చేసేవాళ్లం. రేపు రిలీజ్ ఉండగా టైటిల్ మారిన సినిమా మాదే అనుకుంటా.. ఇది కూడా ఓ రకంగా చరిత్రే అన్నాడు హరీష్ శంకర్.