అన్ని అర్జున్ రెడ్డి లుక్కులే..!

యువ హీరో విజయ్ దేవరకొండ సినిమా వస్తుంది అంటే యూత్ లో ఓ రకమైన క్రేజ్ ఏర్పడుతుంది. అర్జున్ రెడ్డి సినిమాతో తన టాలెంట్ చూపించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత గీతా గోవిందం, టాక్సీవాలా హిట్లతో సత్తా చాటాడు. ఈ ఇయర్ డియర్ కామ్రేడ్ అంటూ వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.      

క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు ఈ సినిమా నిర్మిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ అన్ని సినిమాల్లానే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా చాలా రఫ్ గా ఉంది. అయితే ఇది చాలా ఇంటెన్స్ తో కూడిన ఫస్ట్ లుక్ అని చెప్పొచ్చు. గాయాలతో సగం కాలిన సిగరెట్ ను ఎవరి మీదనే విసురుతూ విజయ్ దేవరకొండ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది.

అయితే విజయ్ దేవర్కొండ ఏ సినిమా లుక్ చూసినా అదే గడ్డం.. అదే ఇంటెన్స్ లుక్ ఉంటుంది. ప్రత్యేకంగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫస్ట్ లుక్ అర్జున్ రెడ్డి సీక్వల్ గా కొడుతుంది. సినిమాలో నలుగురు క్రేజీ హీరోయిన్స్ నటిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.