మెగాస్టార్ బయోపిక్.. అన్న కాదంటే నేను రెడీ..!

బయోపిక్ సినిమాల హవా నడుస్తున్న ఈ టైంలో మెగా హీరో ఎవరు మీడియా ముందుకు వచ్చినా మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ మీరు చేస్తారా అని అడుగుతారు. ప్రస్తుతం శుక్రవారం రిలీజ్ అవుతున్న వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా ప్రమోషన్స్ లో మీడియా చిట్ చాట్ లో వరుణ్ తేజ్ ముందు కూడా మెగాస్టార్ చిరు బయోపిక్ గురించి ప్రస్థావించారు. పెదనాన్న బయోపిక్ చేయాలని ఉంది అయితే అది అన్న చరణ్ చేస్తాడు కావొచ్చు.

ఒకవేళ చరణ్ అన్న అది చేయడానికి ఇష్టపడకపోతే తాను తప్పకుండా చేస్తానని అంటున్నాడు వరుణ్ తేజ్. మెగా ప్రిన్స్ గా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు వరుణ్ తేజ్. ఈ ఇయర్ ఆల్రెడీ ఎఫ్-2 తో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట నిర్మించారు.