
భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ గా పి.ఎం నరేంద్ర మోదీ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. వివేక్ ఓబెరాయ్ నరేంద్ర మోదీ పాత్ర చేశారు. ఎలక్షన్స్ టైంలో వివాదాల్లో చిక్కుకున్న ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కూడా విఫలమైంది. మోదీ గురించి ప్రేక్షకులకు తెలిసిన విషయాలనే ఆ సినిమాలో ప్రస్థావించడంతో సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు.
అందుకే బాలీవుడ్ క్రేజీ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సంజయ్ లీలా భన్సాలి మోడీ బయోపిక్ గా మరో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ లో మన్ బైరాగి అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను తెలుగు టైటిల్ గా మనో విరాగి అని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రభాస్ రిలీజ్ చేశారు. నరేంద్ర మోదీ గురించి బయట ప్రపంచానికి తెలియని విషయాలను ఈ సినిమాలో ప్రస్థావిస్తారని తెలుస్తుంది. సంజయ్ త్రిపాఠి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలి నిర్మిస్తున్నారు.