
దగ్గుబాటి వారసుడు రానా సినిమాలో ఛాన్స్ అంటే కచ్చితంగా అది క్రేజీ ఆఫర్ అని చెప్పొచ్చు. హీరో, విలన్ పాత్ర ఏదైనా అదరగొట్టడం ఖాయం. ప్రస్తుతం రానా విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటుగా 1945 సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండిటితో పాటుగా గుణశేఖర్ డైరక్షన్ లో హిరణ్యకశ్యప సినిమా డిస్కషన్స్ లో ఉంది. వీటితో పాటుగా ఓ కొరియన్ మూవీ మీద కన్నేశాడు రానా.
రీసెంట్ గా కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ గా ఓ బేబీతో సక్సెస్ అందుకున్న నందిని రెడ్డి డైరక్షన్ లోనే రానా సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా అడుగగా ఆమె నో చెప్పినట్టు తెలుస్తుంది. రానాలాంటి క్రేజీ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే కాదనడమా అనుకోవచ్చు. తెలుగు తమిళ భాషల్లో కీర్తి సురేష్ వరుస సినిమాలు చేస్తుంది. మహానటితో నేషనల్ అవార్డ్ అందుకున్న తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అందుకే రానా సినిమా కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయడం కుదరదని చెప్పిందట. ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియా సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ రీసెంట్ గా కోలీవుడ్ మూవీకి సైన్ చేసింది.