గ్యాంగ్ లీడర్ ను వెనక్కి నెడతాడా..?

నాని నటించిన గ్యాంగ్ లీడర్.. వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి రెండు సినిమాలు సెప్టెంబర్ 13న రిలీజ్ డేట్ అనుకున్నారు. అయితే నిర్మాతల చర్చల ఫలితంగా నాని సినిమా అనుకున్న డేట్ కు రిలీజ్ అవగా వరుణ్ తేజ్ సినిమాను సెప్టెంబర్ 20కి వాయిదా వేశారు. నాని గ్యాంగ్ లీడర్ లాస్ ఫ్రైడే రిలీజై మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఓవరాల్ గా సినిమా వసూళ్లు బాగానే ఉన్నాయి. అయితే వరుణ్ తేజ్ వాల్మీకి క్లిక్ అయితే గ్యాంగ్ లీడర్ పై ఎఫెక్ట్ పడినట్టే లెక్క.    

వాల్మీకి సినిమా కోలీవుడ్ జిగుర్తండా కు రీమేక్ గా తెరకెక్కింది. హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మాస్ అండ్ కమర్షియల్ అంశాలు అన్ని ఉన్నాయి. మరో వారంలో సైరా వస్తుంది కాబట్టి ఈలోగా వరుణ్ తేజ్ కలక్షన్స్ రాబట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే వాల్మీకి హిట్ టాక్ వస్తే మాత్రం నాని గ్యాంగ్ లీడర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒకేరోజు వస్తే ఎవరో ఒకరు లాస్ తప్పదని అనుకున్నారు. కాని వారం గ్యాప్ ఇచ్చినా వరుణ్ తేజ్ వల్ల నాని లాస్ అవక తప్పదని టాక్. మరి అనుకున్నట్టుగా వరుణ్ తేజ్ వాల్మీకి అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.