
యువ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తర్వాత చేస్తున్న సినిమా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో తెరకెక్కుతుంది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా వరల్డ్ ఫేమస్ లవర్ అని ఫిక్స్ చేశారు. సినిమాలో లవర్ బోయ్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ త్రెసా, ఇజబెల్లి నటిస్తున్నారు.
డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ టైటిలే చాలా క్రేజీగా ఉంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. టైటిల్ తో సినిమాపై ఓ క్యూరియాసిటీ ఏర్పరిచారు దర్శకుడు క్రాంతి మాధవ్. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా తర్వాత సునీల్ తో చేసిన ఉంగరాల రాంబాబు ఫ్లాప్ అవగా దేవరకొండ విజయ్ తో చేస్తున్న ఈ ప్రయత్నం ఎలా ఉండబోతుందో చూడాలి.