
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు 400 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. రీసెంట్ గా బల్గేరియాలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్ చిన్నపాటి గ్యాప్ ఇచ్చి త్వరలో హైదరాబాద్ లో షెడ్యూల్ మొదలు పెడతారట.
ఇక ఈ సినిమాకు సంబందించిన మరో స్పెషల్ అప్డేట్ ఏంటంటే సినిమాలో కేవలం 3 సాంగ్స్ మాత్రమే ఫిక్స్ చేశాడట రాజమౌళి. ఆ మూడింటితో పాటుగా ఓ స్పెషల్ మోంటేజ్ సాంగ్ ఉంటుందట. సినిమాలో తారక్, చరణ్ ఇద్దరు ఫ్రీడం ఫైటర్స్ కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. అల్లూరిగా రాం చరణ్ నటిస్తున్నారు. అలియా భట్ ఒక హీరోయిన్ అయిన ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరన్నది ఇంకా వెళ్లడించలేదు.