
సినిమాల్లో బాలీవుడ్ ను బీట్ చేసేలా ఉన్న తెలుగు పరిశ్రమలో కొత్తగా బీ టౌన్ స్పెషల్ ప్రోగ్రాంస్ కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే అక్కడ బిగ్ బాస్ సూపర్ హిట్ అవగా మన దగ్గరకు అది వచ్చేసింది. బాలీవుడ్ లో సెలబ్రిటీ టాక్ షోస్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. షోలో అడిగే చిలిపి ప్రశ్నలకు సెలబ్రిటీస్ ఎలాంటి మొహమాటం లేకుండా ఆన్సర్ ఇస్తారు. కపిల్ శర్మ, కరణ్ జోహార్ షోలు అంతే వైల్డ్ గా ఉంటాయి.
ఇక బాలీవుడ్ లో మరో టాక్ షో సూపర్ సక్సెస్ అయ్యింది.. అదే 'ఫీట్ అప్ విత్ స్టార్స్'.. సెలబ్రిటీస్ బెడ్ పైకి వెళ్లాక వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది. మార్నింగ్ నుండి ఈవ్నింగ్ వరకు వారు ఏం చేశారన్నది చెప్పే షోనే ఫీట్ అప్ విత్ స్టార్స్. ఇందులో సెలబ్రిటీస్ బెడ్ రూం సీక్రెట్స్ కూడా రివీల్ చేస్తారు. ఇప్పటివరకు ఎవరికి తెలియని కొన్ని సీక్రెట్స్ కూడా బయటపెడతారు. అయితే ఇలాంటి టాక్ షో తెలుగులోకి వస్తుంది. మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి హోస్ట్ గా ఈ టాక్ షో స్టార్ట్ అవుతుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 ఈ షో నిర్వహిస్తుంది. మరి తెలుగులో ఈ షో ఎలా ఉండబోతుందో చూడాలి.