
నాచురల్ స్టార్ నాని విక్రం కె కుమార్ కాంబినేషన్ లో ఈ ఫ్రైడే రిలీజైన సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాతో నాని మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా దర్శకుడు విక్రం కుమార్ అంతకుముందు ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లతో సినిమా డిస్కషన్స్ జరిపాడు.
తారక్ కు లైన్ చెప్పగా అతని కన్విన్స్ అవ్వలేదు.. బన్నితో కథ ఓకే చేసినా సెకండ్ హాఫ్ కొద్దిగా మార్పులు సూచించాడు అందుకే బన్నితో కూడా సినిమా క్యాన్సిల్ అయ్యింది. అయితే తారక్ కాదన్న లైన్.. బన్ని మార్చమన్నా స్టోరీ గ్యాంగ్ లీడర్ అని తెలుస్తుంది. సినిమా చూశాక ఈ కథలో వాళ్లిద్దరు సూటవరని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే విక్రం వాళ్లిద్దరిలో ఎవరు ఒప్పుకున్నా హీరో క్యారక్టరైజేషన్ కొద్దిగా మార్చేవాడట. మొత్తానికి వద్దని వారు సేఫ్ అయ్యారో.. కాదని నష్టపోయారో కాని నానికి మాత్రం హిట్ పడ్డది.